యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి రెండు వారంలోనూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.మిగితా సినిమాలతో పోటీ తట్టుకొని 10 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఫుల్ రన్ లో 30 కోట్ల క్లబ్ లో చేరనుంది.అయితే ఈ వారం పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుండడంతో కిష్కింధపురికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో సాయి శ్రీనివాస్ ఎట్టకేలకు చాలా రోజుల తరువాత కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టాడు.రాక్షసుడు తరువాత సాయి శ్రీనివాస్ ఎప్పటి నుండో మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురుచూడగా ఫైనల్ గా కిష్కింధపురి ఆ కోరిక నెరవేర్చింది.
కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించారు.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని ఇంతకుముందు డైరెక్టర్ కౌశిక్ కిష్కింధపురి సక్సెస్ మీట్ లో ప్రకటించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























