బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ దృశ్యం నుండి పార్ట్ 3 కూడా రానుందని తెలిసిందే.అందులో భాగంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ,దర్శకుడు జీతూ జోసఫ్ కాంబినేషన్ లో దృశ్యం 3 తెరకెక్కుతుంది.ఈసినిమా షూటింగ్ ఈరోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.డిసెంబర్ లోపు షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.దృశ్యం 3 ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 12 ఏళ్ళ క్రితం వచ్చిన దృశ్యం క్రైం థ్రిల్లర్ డ్రామాల్లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఆ తరువాత ఈసినిమా తెలుగు , హిందీల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.అయితే ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా కోవిడ్ వల్ల థియేటర్లలో రిలీజ్ కాలేదు కానీ ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ కూడా వస్తుంది.మలయాళ వెర్షన్ చిత్రీకరణ పూర్తి కాగానే దృశ్యం 3 తెలుగు ,హిందీ లోకూడా తెరకెక్కనుంది.తెలుగులో వెంకటేష్ హీరోగా నటించనుండగా హిందీలో అజయ్ దేవగన్ చేయనున్నారు.వచ్చే ఏడాది మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3 ని రిలీజ్ చేయనున్నారు.
ఇదిలావుంటే వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో ప్రస్తుతం పీక్ ఫామ్ లో కొనసాగుతున్నాడు మోహన్ లాల్. రీసెంట్ గా తుడరమ్ ,హృదయపూర్వం సినిమలతో వరుసగా విజయాలను అందుకున్నాడు.ఇక నెక్స్ట్ మోహన్ లాల్ వృషభ తో రానున్నాడు.దీపావళికి రిలీజ్ కానుంది.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























