ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపే

OG Grand Pre-Release Event Set for Tomorrow

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ఓజీ మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇక రేపు ట్రైలర్ కూడా రానుంది.ట్రైలర్ ఎలా వుండబోతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపనున్నారు.హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సాయత్రం నుండి ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ ,టికెట్ హైక్ తో విడుదలకానుంది దాంతో మొదటి రోజు ఓజీ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోనుంది.ఇప్పటికే ఓవర్సీస్ లో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో 1.85 మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ట్రైలర్ వచ్చాక ప్రీమియర్స్ తో కలుపుకొని 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.

డివివి దానయ్య ఈసినిమాను నిర్మించగా థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక ఆరుళ్ మోహన్ నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రకాష్ రాజ్,అర్జున్ దాస్ ,శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.ఓజీ ఈనెల 25న పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.