వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్ హీరో బాలకృష్ణ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను ఈసినిమాను తెకెక్కిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ గా వస్తున్న అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.రీసెంట్ గా బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా లో ఇంకో సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉండగా ప్రస్తుతం అందుకు సంబంధించిన షూట్ జరుగుతుంది.ఇందుకోసం ఓ భారీ సెట్ వేశారు. బాలకృష్ణ , సంయుక్త మీనన్ లపై ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.ఈ సాంగ్ షూట్ లో దాదాపు 600మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు.భాను మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.
ఇక ఈసినిమాను ముందు సెప్టెంబర్ 25 చేయాలని అనుకున్నారు కానీ సినిమా రెడీ కాపోవడంతో వాయిదా వేశారు.డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.అఖండ 2లో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్ర కీలక పాత్రల్లో నటించగా ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























