కిష్కింధపురి స్క్రీన్ మీదకి హాలీవుడ్ మూవీ రేంజ్‌లో వచ్చింది

Kishkindhapuri Came on Screen in Hollywood Range, Says Producer Sahoo Garapati

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుప్రీం హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత సాహూ గారపాటి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన సాయి దుర్గతేజ్ గారికి, బాబి గారికి, అనిల్ రావిపూడి గారికి, వశిష్ట గారికి, అనుదీప్ గారికి థాంక్యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన గెస్ట్ లందరూ కూడా సినిమా చూసి మాకు ఫోన్ చేసి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకున్నారు.”

“అందుకే వాళ్ళందరిని పిలిస్తే ఒక స్పెషల్‌గా ఉంటుందని ఈ వేడుక నిర్వహించాము. కౌశిక్ అనుకున్న కథ స్క్రీన్ మీదకి ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో వచ్చింది. ఆడియన్స్ కూడా అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. సాయి శ్రీనివాస్ గారు తన చేస్తున్న సినిమాలకి ఒక డిఫరెంట్ జానర్ చేయాలని ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అనుపమ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.”

“అలాగే నటీనటులు అందరూ తమ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. అందుకే ఆడియన్స్ నుంచి అంత మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. అందరికీ నచ్చింది, కాబట్టి సినిమా అద్భుతంగా ఆడుతోంది. ఇది ఒక నిర్మాతగా చాలా ఆనందాన్నిస్తోంది. ఈ హిట్ మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఎనర్జీ ఇచ్చింది.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.