100 కోట్ల క్లబ్ లో మదరాసి

Madharaasi Joins the 100-Crore Club

తమిళ హీరో శివ కార్తికేయన్ -డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మదరాసి.ఈనెల 5న విడుదలైన ఈసినిమా రివ్యూస్ తో సంబంధం లేకుండా సాలిడ్ వసూళ్లతో 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చింది. శివ కార్తికేయన్ ను కు ఇది నాలుగో 100 కోట్ల సినిమా.ఇంతకుముందు డాక్టర్, డాన్ ,అమరన్ తో ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అమరన్ 300 కోట్లు వసూళ్లను రాబట్టి శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలువగా మదరాసి అందులో సగం కూడా రాబట్టుకోలేకపోయింది. కేవలం తమిళంలోనే ఈసినిమా మంచి వసూళ్లను రాబట్టుకోగలిగింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు.శ్రీ లక్ష్మి మూవీస్ నిర్మించింది.

ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం పరాశక్తి లో నటిస్తున్నాడు.ఇది తనకు 25వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీని సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండగా శ్రీలీల, అథర్వ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.రీసెంట్ గా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్.జనవరి 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.