బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ కిష్కింధపురి థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ కి హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిథులుగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ ఈవెంట్ కి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాని గొప్పగా ఆదరించి ఇంత పెద్ద హిట్ చేసినందుకు కృతజ్ఞతలు.సాయి నేను మంచి ఫ్రెండ్స్. బాబి గారికి అనిల్ రావిపూడి గారికి వశిష్ట గారికి అనుదీప్ గారికి థాంక్యూ సో మచ్. ఇక్కడికి గెస్ట్ లుగా రాలేదు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చారు. ఈ సెప్టెంబర్ మంత్ థియేటర్స్ కి చాలా బావుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బాబీ అన్న అల్లుడు శీను సినిమాకి చాలా మంచి కథ ఇచ్చారు. అప్పుడు నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన మాకు బెస్ట్ విషెస్ అందించడానికి అందించినందుకు చాలా థాంక్స్.
అందరితో నాకు ఒక పర్సనల్ అనుబంధం ఉంది. వారందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కిస్కింధపురి థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాను చూసి సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి. ఇది మీ అందరిని అలరించే సినిమా. తేజ్ తో నాది వెరీ లాంగ్ జర్నీ.ఆయన భైరవం సినిమా కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. మరింత సపోర్ట్ చేసే సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























