50 రోజులు పూర్తి చేసుకున్న మహావతార్ నరసింహ

mahavatar-narasimha-celebrates-golden-50-days-in-theatres

కన్నడ యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తుంది.నిన్నటి తో ఈసినిమా థియేటర్లలో 50రోజులు పూర్తి చేసుకుంది.ఇప్పటికీ 200 కు థియేటర్లలో ప్రదర్శించబడుతూ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రీసెంట్ టైంలో ఇంత లాంగ్ రన్ కనబర్చిన సినిమా మరొకటి లేదు.కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం మౌత్ టాక్ తోనే రోజు రోజు కి కలెక్షన్స్ ను పెంచుకుంటూ సెన్సేషనల్ థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది.ఒక్క హిందీలోనే 175కోట్లకుపైగా నెట్ వసూళ్లను రాబట్టుకుని చరిత్ర సృష్టించింది. ఇక తెలుగులోనూ ఈసినిమా భారీ లాభాలను తీసుకొచ్చింది.ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశారు.

ఇక ఈసినిమా ఊహించని విధంగా సక్సెస్ కావడంతో శాటిలైట్ , ఓటిటి రైట్స్ కు భారీ డిమాండ్ వుంది.మహావతార్ నరసింహ త్వరలోనే ఓటీటీ లోకి రానుంది. విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.