ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది సంయుక్తా మీనన్. విభిన్న కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకుంది.ఇక ఈ హీరోయిన్ చేతిలో ఏకంగా 8 సినిమాలు వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఓ భారీ సినిమా కూడా వుంది అదే అఖండ 2.బాలకృష్ణ , బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సంయుక్త కీలక పాత్రలో కనిపించనుంది.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. డిసెంబర్ లో విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక సంయుక్త తెలుగులో ప్రస్తుతం శర్వానంద్ సరసన నారి నారి నడుమ మురారి, నిఖిల్ స్వయంభు, బెల్లంకొండ శ్రీనివాస్ హైందవ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలోనూ సంయుక్త కీలక పాత్రలో నటిస్తుంది.
ఇవే కాకుండా సంయుక్త తమిళంలో లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో బెంజ్ అనే సినిమాలో అలాగే హిందీలో కాజల్ అగర్వాల్ మాహారంగి లో కీలక పాత్రలు చేస్తుంది.వీటితో పాటు రీసెంట్ గా సంయుక్త , హాస్య మూవీస్ బ్యానర్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓకే చేసింది. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























