టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ మంచు విష్ణు నటించిన మైథాలజికల్ ఎపిక్ కన్నప్ప ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. థియటర్లలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నెం.1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే మొదటి స్థానాన్ని సాధించి మరోసారి తన ప్రభావాన్ని చాటుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉన్నత సాంకేతిక విలువలు, విజువల్ ప్రెజెంటేషన్, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ విజయంతో మంచు విష్ణు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచు మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప కేవలం తెలుగులోనే కాకుండా, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ కొనసాగుతుండగా, అమెజాన్ ప్రైమ్ ట్రెండింగ్ చార్ట్‌లో నంబర్ వన్‌గా నిలవడం ఈ సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది. భక్తి, యాక్షన్, ఎమోషన్‌లతో నిండిన కన్నప్ప మరికొన్ని వారాల పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో హంగామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి ముఖుందన్ కథానాయికగా నటించగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, దేవరాజ్, కాజల్, మధుబాల వంటి ప్రముఖ తారాగణం నటించింది. అలాగే విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు ‘మహాదేవ శాస్త్రి’ పాత్రలో నటించగా.. బ్రహ్మానందం, సప్తగిరి క్యామియో రోల్స్ వేశారు. ఇంకా మంచు ఫ్యామిలీ మూడోతరం వారసులు విష్ణు తనయుడు అవ్రామ్ మరియు కుమార్తెలు అరియనా, వివియానా కీలక పాత్రల్లో మెరిశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























