స్పిరిట్ బీజీఎమ్ లాక్

Background Score Locked for Spirit

గత ఏడాది యానిమల్ తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మూడో సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయనున్నాడని తెలిసిందే. ఈసినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృత గా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది.రీసెంట్ గా హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు.యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రి ప్రభాస్ సరసన నటించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా లాక్ చేశారు.70శాతం బీజీఎమ్ వర్క్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కానుందని సందీప్ రెడ్డి తాజాగా ఓ టీవీ టాక్ షోలో వెల్లడించాడు.ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా టీ సిరీస్ నిర్మించనుంది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు.అందులో ది రాజాసాబ్ ఒకటి.మారుతి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పుటివరకు 80 శాతం గా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈసినిమాతోపాటు ప్రభాస్ ,హను రాఘవపూడితో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.40శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈసినిమా కంప్లీట్ కాకముందే ప్రభాస్ స్పిరిట్ మొదలుపెట్టనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.