నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అఖండ 2” రిలీజ్‌పై ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కావాల్సివుండగా, వాయిదా పడిన విషయం తెలిసిందే. భారీ వీఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ పనులలో జాప్యమే దీనికి ప్రధాన కారణం అని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో బాలయ్య అభిమానులు దీనికోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కొత్త రిలీజ్ సమయం గురించి హీరో నందమూరి బాలకృష్ణ కీలక విషయం వెల్లడించారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో అఖండ 2 గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు తెలిపారు. అలాగే సనాతన హైందవ ధర్మం, సాంప్రదాయాలు, విలువలతో మంచి సినిమాను తీశామని చెప్పారు.
ఇక ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దాని సీక్వెల్‌గా వస్తున్న చిత్రం కావడంతో, ఫ్యాన్స్‌లో దీనిపై భారీ హైప్ ఉంది. మరీ ముఖ్యంగా, బాలయ్య–బోయపాటి కాంబినేషన్లో ఇది నాలుగో చిత్రం. ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ నుంచి వచ్చిన సినిమాలు సూపర్ హిట్స్ కావడంతో, ‘అఖండ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే ఈసారి సినిమా కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, సామాజిక సందేశంతో కూడిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రాబోతోందని సమాచారం. బాలయ్య కొత్త అవతార్, శక్తివంతమైన డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో ఆది పినిశెట్టి పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనుండగా, ప్రగ్యా జైస్వాల్, సమ్యుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదనంగా, ‘భజరంగీ భాయిజాన్’ ఫేమ్ చిన్నారి కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనుంది.
డిసెంబర్ మొదటి వారం “అఖండ 2” రిలీజ్ కానుందని అధికారికంగా స్పష్టత రావడంతో, బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో జోరుగా సంబరాలు చేసుకుంటున్నారు. మరల ఒకసారి బాలయ్య మార్క్ మాస్ మంత్రం తెరపై ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అన్న ఆసక్తి పెరుగుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























