ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేరళ ప్రజలపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. ‘ఓనం’ పండుగ సందర్భంగా ఆయన మలయాళీలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందులో తనను మలయాళీల ‘దత్త పుత్రుడు’గా అభివర్ణించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తెలుగు హీరో అయినప్పటికీ, అల్లు అర్జున్‌కు కేరళలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడి అభిమానులు ఆయనను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. అందుకే తనని ప్రేమగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. తెలుగులో ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను మించి, మలయాళీ ప్రజలు ఆయన సినిమాలు, ఆయన నటనను ఇష్టపడతారు. తెలుగులో యావరేజ్‌గా నిలిచిన అల్లు అర్జున్ సినిమాలు కూడా అక్కడ సూపర్ హిట్లుగా నిలిచాయి.
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినప్పటికీ, కేరళలో ఆయనకున్న అభిమానం చాలా ప్రత్యేకమైనది. ఆయన సినిమాల సక్సెస్, మరియు ఆయన స్టైలిష్ పర్ఫార్మెన్స్ లను మలయాళీ ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారు. ఒక ప్రాంతీయ హీరోకు మరో ప్రాంతంలో ఇంతటి ఆదరణ దక్కడం చాలా అరుదైన విషయం. ఈ విషయంలో అల్లు అర్జున్ అదృష్టవంతుడు అనే చెప్పుకోవాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























