మదరాసి రివ్యూ 

madharaasi telugu movie review

నటీనటులు : శివ కార్తికేయన్ , రుక్మిణి వసంత్ ,విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్
సినిమాటోగ్రఫీ :సుదీప్ ఎల్మోన్
సంగీతం : అనిరుధ్
దర్శకత్వం : ఏఆర్ మురగదాస్
నిర్మాణం : శ్రీ లక్ష్మి మూవీస్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో మదరాసి చేశాడు.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా ఉంది ? ఈసినిమాతో శివ కార్తికేయన్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడో లేదో రివ్యూలో తెలుసుకుందాం.

కథ : 

విరాట్ (విద్యుత్ జమ్వాల్ ) తన స్నేహితుడు చిరాగ్‌ (షబీర్ కళ్లరక్కల్)తో కలిసి తమిళనాడులో తుపాకీ సంస్కృతిని తీసుకురావడానికి ఒక సిండికేట్‌తో చేయి కలుపుతాడు.ఈ దుశ్చర్యను అడ్డుకోవడానికి ప్రేమ్ నాథ్ (బిజు మీనన్) నేతృత్వంలోని ఎన్ఐఏ ప్రయత్నిస్తుంది, కానీ విఫలమవుతుంది.ఈసమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న రఘురామ్‌ (శివ కార్తికేయన్)ను అనుకోకుండా ప్రేమ్ నాథ్ ను కలుస్తాడు. ఆతరువాత తన మిషన్‌లో అతన్ని ఉపయోగిస్తాడు.అసలు ఈ రఘురామ్ ఎవరు? ఎందుకు అతను తన ప్రాణాలను తీసుకోవాలనుకుంటాడు? మాలతి (రుక్మిణి వసంత్)కి అతనితో ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ప్రేమ్ నాథ్ ప్రణాళిక విజయవంతమయ్యిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.  

విశ్లేషణ :

సోషల్ మెసేజ్ లతో కూడిన పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లను అందించడంలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ముందు వరుసలో వుంటారు.అయితే అదంతా ఒకప్పుడు.గత కొన్ని సంవత్సరాలు గా ఈ డైరెక్టర్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.ఇలాంటి తరుణంలో మురగదాస్, మదరాసి తెరకెక్కించాడు.ప్రమోషన్స్ లో గజినీ ,తుపాకి కలిపితే మదరాసి అంటూ చెప్పుకొచ్చాడు.ఇక ఈసినిమాలో కూడా ఆ ఛాయలు కనిపిస్తాయి.

తన మార్క్ స్క్రీన్ ప్లే తో స్టార్టింగ్ నుండే  ప్రేక్షకుడిని కట్టిపడేస్తాడు మురగదాస్.విలన్ విద్యుత్ జమ్వాల్ ఎంట్రీ సీన్ ,యాక్షన్ ఎపిసోడ్  ఒకప్పటి మురగదాస్ ను గుర్తు చేస్తాయి.ఇక ఆ తరువాత శివ కార్తికేయన్ పాత్ర ఎంట్రీ ఇవ్వగా మధ్యలో హీరో- హీరోయిన్ లవ్ ట్రాక్ ,సాంగ్స్  బాగానే ఎంగేజ్  చేస్తాయి.ఇక ప్రీ & ఇంటర్వెల్ , ఇంటర్వెల్ బ్లాక్ ను చాలా బాగా డిజైన్ చేశాడు దర్శకుడు.

దాంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి.అయితే సెకండ్ హాఫ్ అక్కడక్కడా కొంచెం ప్లాట్ గా అనిపించినా ఓవరాల్ సినిమా అయ్యేసరికి బాగానే ఉందని అనే ఫీల్ తెప్పిస్తుంది.ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ ,లవ్ ,కామెడీ ఇలా అన్ని చూపించగా సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ మీదనే రన్ అవుతుంది.ఓవరాల్  గా మదరాసి డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా ముగుస్తుంది. 

నటీనటుల విషయానికి వస్తే రఘు రామ్ పాత్రలో శివ కార్తికేయన్ అదరగొట్టాడు.తన పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది.యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా చేశాడు. ఇక హీరోయిన్ గా రుక్మిణి ఆకట్టుకుంది.తెర మీద శివ కార్తికేయన్,రుక్మిణి ల మధ్య కెమిస్ట్రీ బాగుంది.విలన్ గా విద్యుత్ జమ్వాల్ సూపర్  అనిపించాడు. తన పాత్ర కోసం డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్ గా వున్నాయి.అలాగే కీలక పాత్రలో కనిపించిన బిజు మీనన్ తన అనుభవాన్ని చూపించాడు. .  

టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపించింది.సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ రిచ్ గా వున్నాయి.ఎడిటింగ్ ఓకే.అనిరుధ్ సంగీతం పర్వాలేదు.అయితే  బీజీఎమ్ మాత్రం అదరగోట్టాడు.చాలా చోట్ల బీజీఎమ్ యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది.యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. సినిమాకు బాగానే ఖర్చు చేశారు. 

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన మదరాసి ఆ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.ఇందులో శివ కార్తికేయన్ నటన ,ఇంటర్వెల్ బ్లాక్ ,యాక్షన్ సన్నివేశాలు ,విజువల్స్ హైలైట్ గా నిలిచాయి.యాక్షన్ ప్రియులకు మదరాసి బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా ఓసారి చూసేయొచ్చు.

ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : :point_down:
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్
 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.