కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లోకః చాప్టర్ 1 – చంద్ర కేరళ బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది.వర్కింగ్ డేస్ లోకూడా ఎక్కడా స్లో అవ్వకుండా రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. వీక్ డేస్ లో వరుసగా మూడో రోజు కూడా 5 కోట్ల గ్రాస్ రాబట్టడంతో నిన్నటితో కేరళలో ఈసినిమా 32 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఒక్క కేరళ లోనే కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ హావ కొనసాగిస్తుండడంతో మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 101 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకొంది.దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన సౌత్ ఫిమేల్ సెంట్రిక్ మూవీగా రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే అతి తక్కువ రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో మూడో మలయాళ సినిమాగా లోకః రికార్డులకెక్కింది.ఓవరాల్ మాలీవుడ్ లో 100కోట్ల వసూళ్లను రాబట్టుకున్న 12వ సినిమాగా నిలిచింది.ఇక కేరళలో ఈరోజు దుమ్ము రేపుతోంది ఈసినిమా.రెస్పాన్స్ ఊహించని విధంగా ఉండడంతో థియేటర్లు పెంచుతున్నారు.ఈఒక్క రోజే 2000 షోస్ పడనున్నాయి.దాంతో 6 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకోనుంది.ట్రెండ్ చూస్తుంటే ఈ వీకెండ్ లోపు ఈసినిమా 150 కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
ఇక తెలుగులో కొత్త లోక విడుదలైన ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంటుంది.ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు.అయితే రేపు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కొత్త లోక కు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























