దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లోకః చాప్టర్ 1 – చంద్ర.గత వారం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది.వరుసగా సెకండ్ వర్కింగ్ డే లో కూడా కేరళ లో 5 కోట్లపైనే వసూళ్లను సొంతం చేసుకొని ఎక్స్ లెంట్ హోల్డ్ ను కొనసాగించింది.నిన్నటితో కేరళలో ఈసినిమా 27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకోగా ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన సౌత్ ఫిమేల్ సెంట్రిక్ మూవీగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు మహానటి 84 కోట్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా లోకః ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.ఈరోజు ఈసినిమా 100కోట్ల క్లబ్ లో చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కేవలం మలయాళం లోనే కాదు తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.గత శుక్రవారం కొత్త లోక పేరుతో విడుదలైన నిన్నటి తో దాదాపు 6కోట్ల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది.ముఖ్యంగా మల్టీ ఫ్లెక్స్ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు.ఫుల్ రన్ లో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకురానుంది.
డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ ,శాండీ కీలక పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.ఇక థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో ఓటీటీ రైట్స్ కు ఫుల్ డిమాండ్ వుంది.ఈ యూనివర్స్ మొత్తం 5 భాగాలుగా రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























