ఓజీ గ్లింప్స్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ 

OG Glimpse Receives Tremendous Response

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ.ఈసినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడం దానికి తోడు ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో హైప్ భారీగా నెలకొంది.ఇక నిన్న పవన్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.ఇందులో విలన్ ఇమ్రాన్ హష్మిని పరిచయం చేశారు.ఇందులో ఒమీ గా కనిపించనున్నాడు.బీజీఎమ్ ఫ్రెష్ ఫీల్ తెప్పించింది.ఈవీడియో చివర్లో పవన్ కటారా పట్టుకొని కనిపించాడు.ఓవరాల్ గా అయితే గ్లింప్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.24గంటల్లో 4 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.అందులో భాగంగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారు.త్వరలోనే ట్రైలర్ ను కూడా వదలనున్నారు.సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లలోకి రానుంది.సోలోగా విడుదలకానుండడం అడ్వాంటేజ్ కానుంది.హిట్ టాక్ వస్తే ఓజీ బాక్సాఫీస్ వద్ద విధ్వసం సృష్టించడం ఖాయం.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా శ్రీయా రెడ్డి ,అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : :point_down:
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్
 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.