మహేష్ బాబు గ్లోబల్ ఎంట్రీ.. 120కి పైగా దేశాలలో SSMB29 రిలీజ్

Rajamouli’s Global Vision SSMB29 to Release in Over 120 Countries Worldwide

ఇండియన్ మావెరిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గ్లోబల్ స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘#SSMB29’ (వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో తదుపరి షెడ్యూల్‌ను గత పక్షం రోజులుగా ఆఫ్రికా ప్రధాన దేశమైన కెన్యాలోని అడవులు, మైదాన ప్రాంతాలలో జరుపుకుంది. సినిమాలో కీలకంగా వచ్చే ముఖ్యమైన సీన్స్‌ని ఇక్కడ చిత్రీకరించినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ షెడ్యూల్ పూర్తిచేసుకుని తిరుగుపయనమైన రాజమౌళి బృందానికి కెన్యా ఫారిన్ మినిస్టర్, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ‘బాహుబలి 1 &2, ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమా చిత్రీకరణకు తమ దేశాన్ని గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు కెన్యా అఫీషియల్స్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం చిత్ర బృందం కెన్యాలోని సుందరమైన అడవుల్లో, మరియు సాహసవంతమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరిపింది.

ఈ సందర్భంగా కెన్యా పర్యాటక రంగ అధికారులు, మరియు ఉన్నత అధికారులు రాజమౌళికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ద్వారా కెన్యాలోని అద్భుతమైన విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతాయని, ఇది తమ దేశ పర్యాటక రంగానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.