కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’, ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఎ.ఆర్. మురుగదాస్ గారి సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు మురుగదాస్. ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు.”
“ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు రాక్ స్టార్ అనిరుద్. అనిరుద్ అంటే హిట్ మిషన్. ఆయన ఇచ్చే పాటలన్నీ హిట్. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తిరుపతి ప్రసాద్ గారు. చాలా సింపుల్ పర్సన్. చాలా పెద్ద సినిమా తీశారు. కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చు చేస్తారు, ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అందుకే తెలుగు సినిమాలు తరచుగా వెయ్యి కోట్లకు వెళ్తుంటాయి.”
“ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్. చాలా టాలెంటెడ్. ఈ సినిమాలో లవ్ యాక్షన్ రెండు పిల్లర్స్. అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా రావడానికి కారణం తనే. ఈ సినిమాలో మరో పిల్లర్ విలన్ విద్యుత్ జమ్వాల్. ఆయనతో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. అందరూ సెప్టెంబర్ 5 థియేటర్స్‌కి వెళ్లి మదరాసి చూడండి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, ఎంజాయ్ చేయండి.”
“ఇప్పటివరకు నా సినిమాలు ‘రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు, అమరన్’ లకు మంచి సపోర్ట్ ఇచ్చారు. పెద్ద గుర్తింపు ఇచ్చారు. ఈ సినిమాకి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సక్సెస్ కంటే మీరు చూపించే ప్రేమే నాకు చాలా స్పెషల్. మీరందరూ మరింత ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. మదరాసి తప్పకుండా చూడండి. లవ్ యు ఆల్.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























