అందుకే హరి హర వీరమల్లు నుండి తప్పుకున్నా – క్రిష్

Krish Opens Up on Why He Quit Hari Hara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో సెట్స్ మీదకు వెళ్లిన సినిమా హరి హర వీరమల్లు. అయితే సగం షూట్ పూర్తయ్యాక క్రిష్ ఈసినిమా నుండి  బయటకి వచ్చేశాడు.ఆ తరువాత ఏ ఏం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగితా భాగం డైరెక్ట్ చేశాడు.ఈ జూలై లో సినిమా రిలీజ్ కూడా కాగా అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ఈసినిమా నుండి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడో అనే దానిపై  రక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఘాటి ప్రమోషన్స్ లో భాగంగా క్రిష్ ,హరి హర వీరమల్లు నుండి ఎందుకు తప్పుకోవాల్సివచ్చిందో క్లారిటీ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం.అలాగే ఎ ఏం రత్నం గారిపై గౌరవం వుంది. అయన సినిమాల పోస్టర్లు చూసి స్ఫూర్తి పొందాను. హరిహర వీర మల్లు ను కొంత భాగం షూట్ చేశాను. అయితే ఆతరువాత కోవిడ్ అలాగే వ్యక్తిగత సినిమాల వల్ల సినిమా షెడ్యూల్ లో మార్పులు వచ్చాయి.దాంతో ఈ సినిమా నుండి తప్పుకున్నా అంతే. ఆతరువాత జ్యోతి కృష్ణ ఈసినిమాను ముందుకు తీసుకెళ్లారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు క్రిష్.

ఇక ఈ డైరెక్టర్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఘాటి. అనుష్క ప్రధాన పాత్రలో నటించగా యాక్షన్ జోనర్ లో క్రిష్ తన శైలికి భిన్నంగా ఈసినిమాను తెరకెక్కించాడు.ఈనెల 5న థియేటర్లలోకి రానుంది. ప్రచార చిత్రాలతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.