పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటివరకు 8 లక్షల డాలర్లకుపైగా ప్రీ సేల్స్ అయ్యాయి.ప్రీమియర్స్ తోనే 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి అప్డేట్ వస్తుందో లేదోనని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.ఇప్పటివరకు అయితే మేకర్స్ అప్డేట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.దాంతో ఫ్యాన్స్ నిరాశలో వున్నారు. అయితే ఓజీ నుండి రేపు అప్డేట్ పక్కాగా రానుందని సమాచారం.అందులో భాగంగా గ్లింప్స్ వీడియో ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఈసినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగాప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న ఓజీ పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలోకి రానుంది.హిట్ టాక్ వస్తే ఓజీ కలెక్షన్ల వర్షం కురిపించనుంది.సోలోగా రిలీజ్ కానుండడం ఓజీకి మరింత అడ్వాంటేజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























