గత వారం తెలుగులో నారా రోహిత్ సుందరకాండ అలాగే మలయాళ డబ్బింగ్ సినిమా కొత్త లోక విడుదల కాగా ఈరెండు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటున్నాయి. ఇక ఈవారం మేజర్ గా మూడు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అందులో అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి ప్రముఖ యూట్యూబర్ మౌళి లిటిల్ హార్ట్స్ వున్నాయి. ఈమూడు సినిమాలకు మంచి బజ్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాల్లో ఎక్కువ హైప్ తో వస్తుంది ఘాటి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాను క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేశాడు.క్రిష్ తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను మలిచాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.యూవీ క్రియేషన్స్ ,ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి.
ఇక పేరుకు డబ్బింగ్ సినిమా అయినా మదరాసి పై కూడా అంచనాలు వున్నాయి. అమరన్ తరువాత శివ కార్తికేయన్ వస్తున్న సినిమా ఇది. ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గాతెరకెక్కింది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు. శ్రీ లక్ష్మి మూవీస్ నిర్మించింది.మరి ఈసినిమాతో మురగదాస్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఇక ఈ శుక్రవారం చిన్న సినిమాగా వస్తుంది లిటిల్ హార్ట్స్. #90 వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి ఇందులో హీరోగా నటించాడు.ఇంతకుముందు మౌళి .. మీమ్స్ , యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకులకు సుపరిచితమే. శివాని నగరం ఇందులో హీరోయిన్ గా నటించగా రాజీవ్ కనకాల కీలక పాత్రలో కనిపించారు.యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తుంది. కంటెంట్ మీద నమ్మకంతో ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు , వంశీ నందిపాటి ఈసినిమాను తెలుగురాష్ట్రాల్లో విడుదలచేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























