ఘాటి ప్రమోషన్స్.. అనుష్కకి రానా ఫోన్, ఆడియో వైరల్

Ghaati Promotions Hero Rana and Anushka's Phone Call Goes Viral

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా, స్టార్ హీరో రానా దగ్గుబాటి అనుష్కతో ఫోన్ ఇంటర్వూ చేశారు. దీనికి సంబంధించి వీరిద్దరూ మాట్లాడిన ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు ‘బాహుబలి’ తారల సంభాషణ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ కాల్ లో అనుష్క సినిమా విశేషాలతో పాటు, తన భవిష్యత్ ప్రణాళికలను కూడా బయటపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఘాటి’ గురించి ఆసక్తికర విషయాలు

ఈ సందర్భంగా రానా ఫోన్ చేయగానే, అనుష్క ఆయనతో సినిమా విశేషాలను వివరించారు. “డైరెక్టర్ క్రిష్ నాకు ఎప్పుడూ మంచి పాత్రలనే ఇస్తారు. ఇప్పుడు ‘ఘాటి’లో కూడా నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది” అని ఆమె రానాతో అన్నారు. దానికి రానా “బాహుబలి, అరుంధతి తర్వాత నీకు ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రలు ఇవ్వడం సహజం, అయినా ఇలాంటి క్యారక్టర్లకి నువ్వు తప్ప బెస్ట్ ఆప్షన్ వారికి లేదు” అని అన్నారు.

వరుస సినిమాలు.. అభిమానులకు గుడ్ న్యూస్!

రానా, అనుష్కతో సరదాగా మాట్లాడుతూ, “నువ్వు సినిమాలు చేయడం మానేశావా? ” అని అడిగారు. దానికి అనుష్క మాట్లాడుతూ, “అదేం లేదు, నేను మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను. వచ్చే ఏడాది నుంచి వరుసగా సినిమాలు చేస్తాను,” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆమె అభిమానులకు ఒక గొప్ప గుడ్ న్యూస్. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా తర్వాత అనుష్క తిరిగి వరుసగా సినిమాలు చేయనుండటం, అది కూడా ‘ఘాటి’ లాంటి పవర్‌ఫుల్ సబ్జెక్టుతో ఆమె తిరిగి రావడం ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపుతోంది.

విడుదలకు సిద్ధమైన ‘ఘాటి’

రానా, అనుష్కలు కలిసి ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవ, దేవసేన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఈ ఇద్దరి సంభాషణ వైరల్ అవ్వడం ‘ఘాటి’ సినిమాకు మంచి ప్రచారం కల్పిస్తోంది. కాగా ఘాటి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని సినీ వర్గాలు నమ్ముతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.