హరికృష్ణ జయంతి.. తండ్రిని తలచుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

Jr. NTR's Emotional Post, Remembering Father Harikrishna on His Jayanthi

దివంగత నటుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా, ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్‌ తమ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. తండ్రి ఫోటోను షేర్ చేసి, భావోద్వేగ నోట్ రాశారు. ప్రతి ఏడాది తమ తండ్రి జయంతి మరియు వర్ధంతి రోజున ఆయనను తలుచుకోవడం ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లకు ఆనవాయితీగా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణని తలుచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. “మీ 69వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ… ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే.. మిస్ యూ నాన్నా,” అంటూ ఆయన తన తండ్రిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని అక్షర రూపంలో పంచుకున్నారు. హరికృష్ణ కేవలం ఒక నటుడు, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక గొప్ప తండ్రిగా కూడా తన కుటుంబానికి అండగా నిలిచారు.

2018లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. వీరి భావోద్వేగ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రయాణించిన చైతన్య రథాన్ని నడిపింది హరికృష్ణే. ఇంకా ‘లాహిరి లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య’ లాంటి సినిమాలలో ఆయన నటన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఇక హరికృష్ణ జయంతిని పురస్కరించుకుని.. ఆయన బావ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ కీలక నేత మరియు ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి తదితరులు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా హరికృష్ణతో తమకు గల అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు. వీరితో పాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నందమూరి అభిమానులు హరికృష్ణ జయంతి వేడుకను జరుపుకుంటున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.