ఓజీ నెక్స్ట్ అప్డేట్ ఇదే

Exciting Update from OG Coming Soon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.నిన్న ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ గా సాంగ్ కాకుండా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు సెప్టెంబర్ 2న ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన రానుంది.ఇక  యూఎస్ఏ లో ఓజీ  బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.హిట్ టాక్ వస్తే ఓజీ పవన్ కెరీర్ లోనే బిగెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో పవన్ సరసన ప్రియాంక మెహన్ నటించగా అర్జున్ దాస్ ,శ్రీయా రెడ్డి , ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి నిర్మిస్తున్నారు.ఈసినిమా సోలోగా బాక్సాఫీస్ బరిలో దిగే అవకాశాలు ఎక్కువ వున్నాయి.సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లలోకి రానుంది.

ఇక పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది ఇది సెకండ్ రిలీజ్.ఇంతకుముందు జూలైలో హరిహర వీరమల్లు తో ప్రేక్షకులముందుకు రాగ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.అయితే ఆ ప్రభావం ఓజీ పై పడలేదు. ఈసినిమా భారీ హైప్ తో రిలీజ్ కానుంది. మరి ఓజీతో పవన్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.