సూపర్ స్టార్ రజినీకాంత్ – స్టార్ట్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దర్బార్. ఫస్ట్ టైం ఈ కాంబోలో మూవీ కావడంతో దర్బార్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.దానికి తోడు అప్పటికీ మురగదాస్ సర్కార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఉండడం తో దర్బార్ భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది. అయితే ఈసినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.సినిమాలో మురగదాస్ మార్క్ కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఇక ఈసినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు చెప్పుకొచ్చాడు మురగదాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్క్రిప్ట్ డిమాండ్ మేరకు దర్బార్ ను కొన్ని రియల్ లొకేషన్లలో తీయాల్సిఉండగా భద్రతా కారణాల వల్ల అది కుదరలేదు అలాగే ఈసినిమాను తండ్రి -కూతరు సినిమాగా తీద్దామనుకున్నా అయితే నయనతారను తీసుకొచ్చేసరికి స్క్రిప్ట్ మార్చాల్సి వచ్చింది.అలాగే సినిమా తొందరగా ఫినిష్ చేయాల్సివచ్చింది. ఇంకొంచెం టైం తీసుకోవాల్సింది. దర్బార్ అనుకున్నది అనుకున్నట్లు తీస్తే ఫలితం వేరేలా ఉండేదని మురగదాస్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ఇక ఈఏడాది సమ్మర్ లో సికందర్ తో ముందుకు వచ్చిన మురగదాస్ కి ఆ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది.ఇక నెక్స్ట్ మురగదాస్ డైరెక్షన్ లో మదరాసి రానుంది.శివ కార్తికేయన్ హీరోగా నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.సెప్టెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























