మరింత ఆలస్యం కానున్న ఖైదీ 2

Kaithi 2 to Face Further Delay

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆరేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది తమిళ సినిమా ఖైదీ.హీరో  కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది.తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.ఈసినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రీయేట్ అయ్యింది.ఇక ఖైదీకి సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.అయితే ఈసినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాత డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు ఇంతకుముందు తెలిపారు.

కానీ ఖైదీ 2 మరింత ఆలస్యం కానుంది. దానికి లోకేష్ హీరోగా చేస్తుండడం ఓ కారణం.అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్ లో లోకేష్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈసినిమా పూర్తి చేశాక కూడా ఖైదీ 2 మొదలు పెట్టె అవకాశాలు లేవు. ఎందుకంటే లోకేష్, ఖైదీ 2 కంటే ముందు మరో సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం.సీనియర్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ లతో లోకేష్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.ఈనెల లో అనౌన్స్ మెంట్ కూడా రానుంది.

దాంతో ఆ సినిమాను కంప్లీట్ చేసి కానీ ఖైదీ2 ని మొదలు పెట్టలేడు. ఆలెక్కన 2026 ఫస్ట్ హాఫ్ లో ఖైదీ 2 స్టార్ట్ కానుంది. ఇక కార్తీ ప్రస్తుతం సర్దార్ 2 , మార్షల్ సినిమాల్లో నటిస్తున్నాడు.ఇందులో సర్దార్ 2 ను దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.