పెద్దిలో ఫోక్ సాంగ్

Peddi to Feature a Folk Song

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ప్రస్తుతం సెకండ్ లుక్ కు సంబంధించిన పనుల్లో బిజీగా వుంది టీం.త్వరలోనే అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇక ఈసినిమాలో అదిరిపోయే ఫోక్ సాంగ్ కూడా వుండనుందని సమాచారం. ఏ ఆర్ రెహమాన్ ఈసాంగ్ ను చాలా బాగా కంపోజ్ చేశారట. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ అందించనున్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటివరకు ఈసినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.నవంబర్ లోపు  సినిమాను పూర్తి చేయనున్నారు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.మార్చి 26న పెద్ది థియేటర్లోకి రానుంది.

అయితే ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.పెద్ది వస్తున్న రోజున నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ కూడా రిలీజ్ కానుంది.ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా వున్నాయి.దాంతో ఈ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.