నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పేసిన నాగార్జున

Nagarjuna Announces His Next Project

సీనియర్ హీరో కింగ్ నాగార్జున నటించనున్న 100వ సినిమాపై క్లారిటీ వచ్చింది.నాగ్ సోలో హీరోగా సినిమా చేసి చాలా ఏళ్ళు అయ్యింది. ఇక ఈ 100వ సినిమాను మాత్రం సోలో హీరోగా చేయనున్నాడు. ఈసినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈవిషయాన్ని నాగార్జున ఓ టీవీ టాక్ షో లో వెల్లడించారు.నా నెక్స్ట్ సినిమాను కార్తీక్ తో చేస్తున్నాను .కార్తీక్ ఏడాది క్రితమే నరేషన్ ఇచ్చాడు.స్క్రిప్ర్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్షన్ , ఫ్యామిలీ ,ఫన్ ఇలా అన్ని కలిపి ప్రాఫర్ మూవీగా రానుంది. చాలా గ్రాండియర్ గా ఈసినిమా తెరకెక్కనుంది.త్వరలోనే షూట్ స్టార్ట్ కానుందని నాగార్జున చెప్పుకొచ్చారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకుముందు వార్తలు వచ్చినట్లు ఈసినిమా రీమేక్ అయితే కాదు.ఇక రా కార్తీక్ తమిళంలో నిథమ్ ఓరు వానం అనే సినిమాను డైరెక్ట్ చేశాడు.ఇక రెండో సినిమాతోనే ల్యాండ్ మార్క్ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మరి ఈ దర్శకుడు నాగ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.

ఇక నాగ్ విలన్ పాత్రలో నటించిన కూలీ రీసెంట్ గా విడుదలై అదరగొడుతుంది.ఇందులో నాగ్ యాక్టింగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించారు. ఈ ఏడాది నాగార్జున కు ఇది సెకండ్ రిలీజ్.అంతకుముందు కుబేరతో రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.నాగార్జున బర్త్ డే రోజు ఆగస్టు 29న ఈసినిమా లాంఛ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.