అగ్ర రాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన 43వ ‘ఇండియా డే పరేడ్’ అత్యంత ఘనంగా జరిగింది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్’ ఆధ్వర్యంలో ప్రతి యేడాది ఈ పరేడ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో “ఇండియా డే పరేడ్” గ్రాండ్‌గా నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెరికాలోనే అతిపెద్ద భారతీయ పరేడ్‌గా గుర్తింపు ఉన్న ఈ వేడుకల్లో ఈసారి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. న్యూయార్క్ సిటీలో జరిగిన ఈ పరేడ్‌లో వారిద్దరూ ‘గ్రాండ్ మార్షల్స్’గా గౌరవించబడ్డారు. ఇక ఈ ప్రత్యేక సందర్భంలో ఈ స్టార్స్ పాల్గొనడం ఇద్దరి అభిమానుల్లో ఆనందం నింపింది.
కాగా విజయ్ – రష్మికలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఎప్పటినుంచో రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడూ పండుగల సమయంలో విజయ్ ఇంటిలో రష్మిక దర్శనం ఇవ్వడం, అలాగే సోషల్ మీడియాలో వీరిద్దరూ పంచుకున్న కొన్ని ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుండటంతో ఆ వార్తలకు మరింత బలమొచ్చింది. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ దీని గురించి బహిరంగంగా ఏమీ చెప్పలేదనేది గమనార్హం.
దీంతో విజయ్ – రష్మికల మధ్య కెమిస్ట్రీ రియల్ లైఫ్‌లోనూ ఉందా? లేక అభిమానుల ఊహ మాత్రమేనా? అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కానీ వీరిద్దరూ ఎక్కడ కలిసి కన్పించినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతారనేది మాత్రం నిజం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంట మళ్లీ కలసి ఇండియా డే పరేడ్‌లో పాల్గొనడం అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక కెరీర్ పరంగా చూస్తే – ఇటీవల విజయ్ నటించిన ‘కింగ్‌డమ్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా, దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రం చేయనున్నారు. మరోవైపు రష్మిక మాత్రం వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. ‘యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర’ వంట వందలకోట్ల ప్రాజెక్ట్స్‌లో ఆమె భాగం అయింది. అలాగే ఆమె ప్రధానపాత్రలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ త్వరలో రాబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























