ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్న రాజా సాబ్‌ హీరోయిన్

The Raja Saab Actress Nidhhi Agerwal Announced Her Next Project

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి హై-బడ్జెట్ స్పెక్టికల్ ‘హరిహర వీరమల్లు’లో నటించిన నటి నిధి అగర్వాల్, ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్‌’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇలా వరుస ఎక్సయిటింగ్ ప్రాజెక్టులతో తన అభిమానులను అలరిస్తున్న నిధి అగర్వాల్ ఇప్పుడు ఓ గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్‌కి సైన్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిధి అగర్వాల్ లీడ్ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాని తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ కింద శ్రీ పుప్పాల అప్పల రాజు (ఎ.ఆర్.) నిర్మిస్తున్నారు. ఇది వారి ప్రొడక్షన్ నంబర్ 1. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా నిఖిల్ కార్తీక్.ఎన్ అరంగేట్రం చేస్తున్నారు. నిధి స్పెషల్ డేను సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ ద్వారా నిధికి విషెస్ చెప్తూ, రాబోయే సినిమా హారర్ థ్రిల్‌ని ముందుగానే టోన్ సెట్ చేశారు. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌‌‌‌‌‌‌‌తో ఆడియన్స్ కి విజువల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్‌గా ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోంది. దసరా సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేయనున్నారు మేకర్స్.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ పుప్పాల అప్పల రాజు మాట్లాడుతూ.. “నిధి అగర్వాల్ తన క్యారెక్టర్ కి అద్భుతమైన చార్మ్ తీసుకోస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్ లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. ఆమె బిగ్ స్క్రీన్ పై చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం.” అని అన్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రాబోతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.