టాలీవుడ్ బడా ఫ్యామిలీలలో ఒకటైన ‘మంచు’ కుటుంబంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణుకి, చిన్న కుమారుడు మనోజ్‌కి మధ్య తలెత్తిన విభేదాలు పోలీస్ కేసుల వరకూ కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, ఈ గొడవలు సమసిపోయే సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివరాల్లోకి వెళ్తే.. మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటించిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న విడుదలై ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ మూడో తరం వారసులు వెండితెరకి పరిచయం అయ్యారు. విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా మరియు కుమారుడు అవ్రామ్, ఇంకా విష్ణు సోదరి లక్ష్మి మంచు కుమార్తె విద్యా నిర్వాణ నటించడం విశేషం.
ఈ మూవీలో అవ్రామ్ చిన్నప్పటి ‘తిన్నడు’ పాత్రలో మంచి నటనను కనబరిచాడు. ఈ క్రమంలో తన మొదటి సినిమాతోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా నిర్వహించిన ‘సంతోషం ఫిల్మ్ అవార్డ్’ వేడుకలలో అవ్రామ్ ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వీడియోను విష్ణు మంచు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో అవ్రామ్ తాత మోహన్ బాబు, తండ్రి విష్ణులతో కలిసి వచ్చి సందడి చేసాడు.
ఈ నేపథ్యంలోనే విష్ణు సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో.. “కంగ్రాట్స్ అవ్రామ్.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను మై బాయ్. ఇలాగే ముందుకు సాగు నాన్నా. విష్ణు అన్న మరియు నాన్న మోహన్ బాబుతో కలిసి అవ్రామ్ఈ అవార్డు అందుకోవడం చాలా స్పెషల్. ఎంతో ప్రేమతో..” అని ఎమోషనల్‌గా పేర్కొన్నాడు. దీంతో మంచు బ్రదర్స్ మధ్య తిరిగి సత్సంబంధాలు ఏర్పడబోతున్నాయంటూ అభిమానులు మరియు నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























