రికార్డు సృష్టించిన ఓజీ ఫస్ట్ సింగిల్

Massive Milestone for OG First Single

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెక్స్ట్ ఓజీతో రానున్నాడని తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామా కావడం అలాగే పవన్ వీరాభిమాని సుజీత్ తెరకెక్కిస్తుండడంతో ఓజీ పై మొదటి నుండే భారీ అంచనాలు వున్నాయి.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి ఆ అంచనాలను మరింతగా పెంచారు.ఫైర్ స్ట్రోమ్ అంటూ వచ్చిన ఈసాంగ్ టాలీవుడ్ లో అత్యధిక లైకులు పొందిన లిరికల్ వీడియో గారికార్డు క్రియేట్ చేసింది.24గంటల్లో 8 లక్ష్లలకుపైగా లైక్స్ సొంతం చేసుకుంది.వ్యూస్ పరంగాను ఈ సాంగ్ సూపర్ అనిపించుకుంది.యూట్యూబ్ లో ఇప్పటివరకు 8 మిలియన్ల కుపైగా వ్యూస్ రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈసాంగ్ లో పవన్ షాట్స్ అరాచకం అని చెప్పొచ్చు.ఓవరాల్ గా ఓజీ ఫస్ట్ సింగిల్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఓజీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓజీ పవన్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.

ఇక పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీలీల ,రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ప్రథమార్థం లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.