మిలియన్ మార్క్ దాటిన కూలీ

Coolie Surpasses 1 Million in Advance Sales with a Bang

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ హైప్ మాములుగా లేదు.పేరుకు తమిళ సినిమానే అయినా తెలుగులో కూడా భారీ హైప్ వుంది.ప్రస్తుతం టీం అంతా తెగ ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రమోట్ చేస్తున్నారు.రెండు రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ఈసినిమా అదరగొడుతుంది.నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ప్రీ సేల్స్ 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.ప్రీమియర్స్ తోనే ఈసినిమా అక్కడ 2 మిలియన్ ను చేరుకోనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై కోలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్ల వసూళ్లను రాబట్టుకునే సినిమా కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగు, హిందీలో ఈసినిమాకు భారీ పోటీ ఎదురుకానుంది. కూలీ విడుదలవుతున్న రోజే వార్ 2 కూడా వస్తుంది.ఎన్టీఆర్ ఉండడం తో తెలుగులోనూ వార్ 2పై భారీ అంచనాలు వున్నాయి.సో బాక్సాఫీస్ వద్ద కూలీకి పోటీ తప్పదు.

లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ఉపేంద్ర ,సత్య రాజ్ ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.