ఇలాంటి వెబ్‌సైట్‌ నేను ఇదివరకు ఎక్కడ చూడలేదు – దేవి

Rock Star Devi Sri Prasad Praises Producer Dil Raju For Launching Dil Raju Dreams

కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ సహా ఇండస్ట్రీలోకి రావాలనుకునే అందరికీ సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా హాజరై వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ గుడ్ ఈవెనింగ్. ఇంత మందిని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఒక క్రియేషన్ ఒకరి కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసేవారికంటే నిరుత్సాహపరిచే వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే మన పక్కనున్న వాళ్ళు మనల్ని నిరుత్సాపరిస్తే మనలో ఒక ఫైర్ రావాలి. ఎంతమంది నిరుత్సాహపరిచినా మీ కలని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూనే వెళ్ళండి. ఎవరూ ఆపలేరు.”

“దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు, శిరీష్ గారు విజయ్ దేవరకొండ.. మన కలని మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. రాజుగారంటే మాకు ఫ్యామిలీ. ఆయన నాకు పెద్దన్నయ్య లాంటివారు. దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక అద్భుతమైన వేదిక. యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా ఒక కాలమ్ కేటాయించడం గొప్ప విషయం.”

“ఇలాంటి వెబ్‌సైట్‌ నేను ఇదివరకు ఎక్కడ చూడలేదు. గొప్ప ప్రొడక్షన్ హౌస్ ఈ వెబ్‌సైట్‌ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మీ అందరికీ ఒక గొప్ప ఫ్లాట్‌ఫామ్. సక్సెస్ అనేది మన అల్టిమేట్ టార్గెట్‌గా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే లైఫ్‌లో డల్ మూమెంట్ అనేది ఉండదు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.