కాంత రిలీజ్ అప్డేట్

Kaantha Planning For September 5 Release in Cinemas

లక్కీ భాస్కర్ తరువాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ కాంతతో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఇందులో ప్రముఖ తెలుగు హీరో రానా దగ్గుబాటి విలన్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. అంతేకాదు రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ఆగస్టు లో రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నారట మేకర్స్.సెప్టెంబర్ 5న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.ఆల్రెడీ శివకార్తికేయన్ మదరాసి అలాగే టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా మిరాయ్ ఆ డేట్ ను లాక్ చేసుకున్నాయి.దాంతో అదే డేట్ కు వస్తే బాక్సాఫీస్ వద్ద కాంత పోటీ ఎదురుకోక తప్పదు.త్వరలోనే ఈ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.

ఇక గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు దుల్కర్ సల్మాన్ .ఈసినిమాతో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈసినిమా తరువాత దుల్కర్ ప్రస్తుతం తెలుగులో పవన్ సాధినేని డైరెక్షన్ లో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుంది.రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు.ఇది కూడా ఈఏడాదే విడుదలకానుంది. మరి ఈసినిమాతో తెలుగులో దుల్కర్ హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.