భారీ అంచనాల మధ్య గత శుక్రవారం విడుదలైన మంచు విష్ణు కన్నప్ప సూపర్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 55కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో మంచు విష్ణు కెరీర్ లోనే ఈసినిమా హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ముఖ్యంగా ఈసినిమా నిన్న స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించి 18కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.అయితే టార్గెట్ ఎక్కువగా ఉండడంతో ఈరోజు నుండి కూడా అదే జోరు కొనసాగించాల్సి ఉంటుంది.ఇక దాదాపు 10 వారాల తరువాతే కన్నప్ప ఓటీటీలోకి రానుంది.ఈడీల్ ఇంకా క్లోజ్ కావాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన డ్రీం ప్రాజెక్ట్ కావడంతో మంచు విష్ణు ఈసినిమా కోసం బాగానే ఖర్చు చేశాడు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశాడు.రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో వుండడం కూడా కలిసొచ్చింది.ప్రభాస్ ఇందులో రుద్ర రోల్ లో కనిపించగా ఆ పాత్రకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. క్లైమాక్స్ కూడా బాగుందనిపించుకుంది.మరి ఫుల్ రన్ లో కన్నప్ప ఏ రేంజ్ లో వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి.
శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈసినిమాలో కన్నప్పగా మంచు విష్ణు నటించగా మోహన్ బాబు ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























