తెలుగు రాష్ట్రాల్లో కుబేర సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్న వర్కింగ్ డే రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 85కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.అంతేకాదు బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేయనుంది.అయితే తమిళంలో మాత్రం ఈసినిమా ఆశించినంత గా రాబట్టలేకపోతుంది.ధనుష్ లాంటి స్టార్ యాక్టర్ వున్నా కూడా నాలుగు రోజుల్లో ఈసినిమా అక్కడ 15 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు ఓవర్సీస్ లో కూడా కుబేర అదరగొడుతుంది.నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 1.8 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది. రేపటి తో 2 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.ధనుష్ అలాగే నాగార్జునకు ఇదే మొదటి 2 మిలియన్ డాలర్ సినిమా కానుంది.ఇక ఈసినిమాతో ధనుష్ ,సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన హీరోగా రికార్డు సృష్టించాడు.ధనుష్ కు ఇది తెలుగులో రెండో సినిమా కాగా మొదటి సినిమా సార్ తెలుగు తమిళ్ లో కలిపి 100కోట్ల పైనే రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇప్పుడు కుబేర కూడా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ధనుష్ ,నాగార్జున ,రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























