విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రుద్ర’ అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కన్నప్ప నుండి రిలీజ్ చేసిన క్యారెక్టర్ రివీల్ పోస్టర్స్, నాలుగు పాటలు, టీజర్, ట్రైలర్.. అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. దీనికిముందు విష్ణు మంచు అమెరికా, కర్ణాటక, తమిళనాడు, ముంబై తదితర నగరాలలో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల స్థానిక మీడియాలో కూడా ఈ మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. దీంతో కన్నప్ప సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కాగా ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్పను అన్ని భాషల వారికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆయా ఇండస్ట్రీలలోని స్టార్ యాక్టర్స్‌ని ఇందులో నటింపజేశారు హీరో విష్ణు. దీనిలో భాగంగా కోలీవుడ్ నుంచి ప్రీతి ముఖుంధన్, శరత్ కుమార్, మధుబాల.. మలయాళం నుండి మోహన్ లాల్.. కన్నడ నటుడు దేవరాజ్.. టాలీవుడ్ నుంచి బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదిలావుంటే కన్నప్ప సినిమాలో విష్ణు హీరోగా, ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు ‘మహాదేవశాస్త్రి’ అనే ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వీరితోపాటుగా ‘మంచు’ ఫ్యామిలీ నుంచి మూడోతరం వారసులు కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. విష్ణు కుమారుడు అవ్రామ్ మరియు కవల కుమార్తెలు అరియనా, వివియానా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక అవ్రామ్, కన్నప్ప చిన్నప్పటి పాత్రను పోషించడం గమనార్హం. ఈ మూవీలో ఈ థర్డ్ జెనరేషన్ కిడ్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు.
భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన కన్నప్ప చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు పేరొందిన డిష్ట్రిబ్యూషన్ సంస్థలు ముందుకొస్తున్నాయి. కేరళలో ఈ సినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుండగా.. తమిళంలో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ రిలీజ్ చేయనుంది. కర్ణాటకలో స్టార్ ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్ సమర్పిస్తున్నారు. తెలుగులో బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























