శేఖర్ కమ్ముల ఆ హోప్ ఇచ్చారు – ధనుష్

dhanush speech at the kuberaa success meet

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సూపర్ స్టార్ ధనుష్,కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కుబేర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.ఇక ఈసినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా మేకర్స్ నిన్న కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు.మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇందులో హీరో ధనుష్ మాట్లాడుతూ ..అందరికి నమస్కారం ఇది. ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు కోసమే ప్రతి ఆర్టిస్ట్ ఎదురుచూస్తారు. ఇలాంటి రోజుల్ని సెలబ్రేట్ చేసుకోవాలి.ఒక సినిమాకి యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ రావడం అనేది చాలా అరుదు. అది ఈ సినిమాకి జరిగింది.ఈ విషయంలో మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ దేవుడిచ్చిన సక్సెస్ గా భావిస్తున్నాం.ఈ సందర్భంగా ఈ సినిమాని గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు అభిమానులకు ధన్యవాదాలు.యాక్షన్, బ్లాస్టింగ్స్ ఉన్న సినిమాలే థియేటర్స్ లో ఆడుతున్నాయని అలాంటి సినిమాలకే థియేటర్స్ జనాలకి వస్తున్నారని ఒక వాదన ఉంది.కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. హార్ట్ ఫుల్ గా సినిమా తీస్తే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకురావచ్చు అనే హోప్ ని ఆయన ఇచ్చారు.

ఎమోషన్ అనేది బిగ్గెస్ట్ గ్రాండియర్.హ్యూమన్ ఎమోషన్స్ కంటే పెద్ద గ్రాండియర్ ఏది ఉండదు.తమిళ్ లో ఈసినిమా చాలా అద్భుతంగా ఆడుతోంది.ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది.ముందు నిర్మాత మొహంలో ఆనందం చూసి సినిమా ఎంత సక్సెస్ అయిందో చెప్పొచ్చు అని మా నాన్న చెప్పేవారు.మా నిర్మాతలు ఆనందంగా ఉండడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.చిరంజీవి గారు వచ్చి మా టీం కి బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది మెగా సక్సెస్.చిరంజీవి గారు నాగార్జున గారి సమక్షంలో మాట్లాడడం అనేది ఒక గొప్ప బ్లెస్సింగ్ భావిస్తున్నాను.సినిమాని నెక్స్ట్ లోనికి తీసుకెళ్లి ఆడియన్స్ కి చేరువ చేసిన మీడియాకి థాంక్యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.