`భీష్మ‌`కి ముహుర్తం కుదిరిందా?

Nithiin Bheeshma Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Nithiin Bheeshma Movie Shooting Updates,Bheeshma Telugu Movie Latest News,Nithiin New Movie Bheeshma,Nithiin Upcoming Film Bheeshma,Bheeshma Movie Shoot
Nithiin Bheeshma Movie Latest Update

యువ క‌థానాయ‌కుడు నితిన్ క‌థానాయ‌కుడిగా `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. `భీష్మ‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. కాగా… ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయ‌ని తెలిసింది. అంతేకాదు… ఆ రోజు నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో యూనిట్ ఉంద‌ట‌. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… జూలైలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌నున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెలువ‌డుతాయి. `అ ఆ` త‌రువాత స‌రైన విజ‌యం లేని నితిన్‌కి ఈ సినిమా విజ‌యం కీల‌కంగా మారింది. మ‌రి… `భీష్మ‌`తోనైనా నితిన్ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తాడేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=v09iGbZdp-g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.