ఇటీవల సీరియస్ పాత్రలతో మెప్పించిన అల్లరి నరేష్ మళ్లీ తన బలం అయిన అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్‌లోకి అడుగుపెడుతున్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ . ‘యముడికి మొగుడు’ తర్వాత ఆయన నటిస్తున్న సోషియో-ఫాంటసీ కామెడీ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆఫీషియల్ టీజర్ లాంచ్ డేట్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ఆగస్టు 10న హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో మధ్యాహ్నం 1:00 గంటకు గ్రాండ్‌గా టీజర్‌ను విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో అల్లరి నరేష్ స్వర్గానికి, భూలోకానికి మధ్య జరిగే ఫాంటసీ వినోదంతో అలరించబోతున్నారు.వెన్నెల కిషోర్, నరేష్ వికె, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























