పూరి – విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌లో టబు

Actress Tabu Joins Vijay Sethupathi, Puri Jagannadh's Project

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఉగాది శుభ సందర్భంగా ప్రకటించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తమ బ్యానర్ పూరి కనెక్ట్స్ పావు గ్రాండ్ గా నిర్మిస్తారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ సినిమా కోసం పూరి జగన్నాధ్ పవర్ ఫుల్ కథని రాశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, డిఫరెంట్ అవతార్‌లో చూడబోతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఈ ఎక్సైట్‌మెంట్‌ని పెంచుతూ, ఇంట్రెస్టింగ్ న్యూస్ అందించారు మేకర్స్. సీనియర్ యాక్ట్రెస్ టబు ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపించారు. ఆమె ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

సెలెక్టెడ్ రోల్స్‌కి పాపులరైన టబు, ఈ పాత్ర, కథాంశం నచ్చి వెంటనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి అంగీకరించడం విశేషం. ఈ సినిమా జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సిబ్బందిని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.