విశ్వంభర ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ ప్రోమో రిలీజ్

Vishwambhara First Single Rama Raama Promo Out

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ ప్రధాన కథానాయికలుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేయగా.. దసరా సందర్భంగా విడుదలచేసిన టీజర్ టాప్ ట్రెండింగ్‍లో నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా విశ్వంభర నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ శనివారం (ఏప్రిల్ 12) హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ నుంచి రామ రామ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నేడు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది విజువల్ స్టన్నింగ్‍గా ఉండి ప్రేక్షకులని మెగా మాస్ బియాండ్ యూనివర్స్ లోకి తీసుకెళ్ళింది. సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట ఆడియెన్స్ ని డివోషనల్ మోడ్ లోకి తీసుకెళ్లనుంది.

ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్స్ కాగా, సుస్మిత కొణిదెల స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. విక్రమ్‌రెడ్డి సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.