హీరో నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ నో బడీ’. చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దీంతో కోర్ట్ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే ఓవర్సీస్‌లో సైతం 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి అక్కడ కూడా హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్ట్ నేడు స్ట్రీమింగ్‍కి వచ్చేసింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని పొందండి.
కాగా కోర్ట్ చిత్రం పోక్సో యాక్ట్ నేపథ్యంలో రూపొందింది. కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, శివాజీ కీలక పాత్రలు పోషించగా.. యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా శివాజీ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా నానితో కలిసి ప్రశాంతి తిపిర్నేని కోర్ట్ మూవీని నిర్మించారు.
కోర్ట్ కథ ఏంటంటే..?
వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరిగే కథ ఇది. 19ఏళ్ళ చందూ (రోషన్) ఒక మధ్యతరగతి అబ్బాయి. జాబిలి( శ్రీదేవి) చందూ కన్నా రెండేళ్లు చిన్నది. అనుకోకుండా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తరువాత ఇరువురూ ప్రేమలో పడతారు. అయితే జాబిలికి తండ్రి లేడు. మేనమామ మంగపతి (శివాజీ) సంరక్షణలో ఆమె పెరుగుతుంది. ఈ మంగపతి పరువు కోసం ప్రాణాలిచ్చే వ్యక్తి. ఈ క్రమంలో ఒకరోజు చందూ, జాబిలి ప్రేమ కథ మంగపతికి తెలుస్తుంది.
దీంతో అతను ఫైర్ అవుతాడు. తనకున్న పలుకుబడి, డబ్బుతో చందూపై పలు సెక్షన్స్‌లో కేసులు పెట్టించి జైల్లో వేయిస్తాడు. 78రోజుల వరకు బెయిల్ కూడా రాకుండా చేస్తాడు. చివరికి తుది తీర్పు వెలుబడే తరుణంలో ఈ కేసు జూనియర్ లాయర్ సూర్య (ప్రియదర్శి) టేకప్ చేస్తాడు. ఆ తరువాత ఏమైంది? సూర్య, చందూకి శిక్ష పడకుండా ఆపగలిగాడా? జైలు నుంచి విడిపించగలిగాడా? చివరికి జాబిలీ, చందూల ప్రేమకథ ఏమైంది? అనేదే మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: