‘పుష్ప 2’ చిత్రంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ.1900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని చరిత్ర సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రంలో నటించనున్నారు. మైథలాజికల్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పురాణం పురుషుడు కుమారస్వామి పాత్రను పోషించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, తాజాగా అల్లు అర్జున్ మరో ప్రాజెక్టును ఓకే చేశారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్, ‘రాజారాణి’ ఫేమ్ అట్లీ డైరెక్షన్ లో ఆయన ఒక చిత్రాన్ని (#AA22xA6) చేయనున్నారు. ఈ సినిమాను టాప్ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ మేరకు తాజాగా దీని గురించి అధికారిక ప్రకటన వచ్చింది. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇటు హీరో, అటు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో ఒక స్పెషల్ వీడియోను షేర్ చేశారు.
అయితే పుష్ప 2 చిత్రంతో అల్లు అర్జున్ వసూళ్ల పరంగా ఒక బెంచ్ మార్క్ సిద్ధం చేయగా, దీనిని అట్లీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లనున్నాడు. అట్లీ తన గత చిత్రం ‘జవాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా రూ.1100కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక అట్లీకి హిందీలో ఇదే తొలి మూవీ కావడం విశేషం. ఒక సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ హీరోతో ఈ రేంజ్ హిట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇలా అల్లు అర్జున్, అట్లీ సాలిడ్ హిట్స్ అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేయనుండటంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కాగా ఈ క్రేజీ కాంబోపై గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న క్రమంలో నేడు దీనిపై అఫీషియల్ న్యూస్ రావడం ఫిల్మ్ నగర్ వర్గాల్లో క్యూరియాసిటీ పెంచింది. ఇక త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుండగా.. ఇందులో నటించనున్న ఇతర నటీనటుల వివరాలు మరియు పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























