పవన్‌ కళ్యాణ్ చిన్న కుమారుడికి అగ్నిప్రమాదంలో గాయాలు

AP Deputy CM Pawan Kalyan Son Mark Shankar Injured in Fire Mashup

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి ప్రమాదం జరిగింది. సింగపూర్‌లో మార్క్ శంకర్‌ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రమాదం అనంతరం స్కూల్ యాజమాన్యం మార్క్ శంకర్‌‌ను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్ నేడు సింగపూర్‌ వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు పవన్‌ ఈరోజు డుంబ్రిగుడ మండలం కురిడిలో ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇక ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన సింగపూర్ పయనం కానున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.