కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ప్రసన్న, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా ఇతర ప్రచార చిత్రాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా టీజర్, ట్రైలర్‌లను రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అద్భుతమైన యాక్షన్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో గుడ్ బ్యాడ్ అగ్లీ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ని ఇవ్వబోతుందని ఇవి ప్రామిస్ చేస్తున్నాయి. ఏప్రిల్ 10న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తాజాగా అన్ని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ జారీచేసింది. అలాగే మేకర్స్ ఈ చిత్రానికి దాదాపు 2 గంటల 18నిమిషాల రన్ టైంను సెట్ చేశారట. దీంతో ఇప్పటికే ఇటు ఇండస్ట్రీలో అటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ బడ్జెట్‌తో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























