టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే దీనికి వివిధ భాషలలో పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ తదితరులు తమ గాత్రం అందించారు. ఈ నేపథ్యంలో తెలుగులో వాయిస్ ఓవర్ అందించాలని కోరినప్పుడు హీరో ఎన్టీఆర్ ఎలా స్పందించారో తాజాగా విజయ్ దేవరకొండ వివరించారు. ఈ మేరకు ఆయన దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ (WITT) గ్లోబల్ సమ్మిట్ 2025 మూడో ఎడిషన్ వేడుకలో పాల్గొన్న సందర్భంగా దీనిపై మాట్లాడారు.
“కింగ్‌డమ్ తెలుగు టీజర్ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే బావుంటుందని టీమ్ అంతా అనుకున్నాం. అందుకోసం ఒకరోజు ఆయనను కలిసి విషయం చెప్పాను. తారక్ వెంటనే, ఈ సాయంత్రం రికార్డ్ చేద్దాం అని అన్నారు. అయితే దర్శకుడు చెన్నైలో ఉన్నారని, టీజర్ మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నారని నేను చెప్పాను.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “దీంతో తారక్ అన్న ‘నో ప్రాబ్లెమ్, నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా, మనం చేద్దాం అని అన్నారు. ఆ డైలాగ్స్ ఆయనకు బాగా నచ్చాయి. అద్భుతంగా వాయిస్ ఓవర్ అందించారు. అన్నను గతంలో నేను తరచూ కలవకపోయినా, మా టీజర్ కోసం ఆయన వాయిస్ ఇవ్వడం నాకు స్పెషల్ అనిపించింది. అలాగే హిందీ కోసం రణ్‌బీర్ కపూర్, తమిళ వెర్షన్ కోసం సూర్య సర్‌ని అడిగితే వాళ్లు కుడా వెంటనే అంగీకరించారు. అందరికీ థ్యాంక్స్” అని విజయ్ దేవరకొండ చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























