డెవిల్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో రానున్నాడు. ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడం తో ప్రమోషన్స్ మొదలు పెట్టింది టీం.రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక పాటలను విడుదలచేయనున్నారు.అందులో భాగంగా ఈనెల 31న ఫస్ట్ సింగిల్ నాయాల్ది రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఇందులో కళ్యాణ్ రామ్ కు తల్లిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాపై మంచి బజ్ వుంది.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనుంది.ట్రైలర్ కట్ కూడా జరిగిపోయింది. వచ్చే వారం రిలీజ్ చేయనున్నారు.
ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ రాజ్,సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























